సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్ లో నూతన బీఆర్ఎస్ ఆఫీస్ భవనం ఆవరణలో నేడు, బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ జెం డా ఆవిష్క రించారు. పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కెసిఆర్ జెం డా ఆవిష్కరించి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కర్ణాటక, యూపీ మాజీ సీఎం లు, కుమారస్వా మి, అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఈ కార్య క్రమానికి భారీగా తరలివచ్చాయి. వీరితో పాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చా రు.మంత్రి కేటీఆర్ మాత్రం హైదరాబాద్ లోనే పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. జాతీయ రాజకీయాల్లోతన ముద్రను వేసేందుకు టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.
