సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆరేళ్ల తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ కూటమిలో తెలుగుదేశం పార్టీ 4వ మారు అడుగు పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఏపీలో 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని సాకుతో అకస్మాత్తుగా బీజేపీ కి దూరంగా జరిగి కాంగ్రెస్ తో జత కట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పలుమారులు చేదు అనుభవం దృష్ట్యా.. బీజేపీ పెద్దలు దూరం దూరంగా ఉన్నప్పటికీ.. దేశంలోనే అతి బలమైన 4వ పార్టీగా ఎదిగిపోయిన సీఎం జగన్ సారధ్యంలోని వైసిపి ని ఏపీలో అధికారంలో నుండి దించాలంటే జనసేన తో పాటు కేంద్రంలోని బీజేపీ మద్దతు అస్సిసులు కూడా తీసుకోవాలని చంద్రబాబు బలంగా భావించారు. అయితే సీఎం జగన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వివిధ అంశాలలో మద్దతు ఇస్తారే, తప్ప రాష్ట్రంలో బీజేపీ తో జతకట్టేందుకు కానీ సీట్లు ఇవ్వడం కానీ ససేమిరా.. అంటూ బీజేపీ కి ఏపీలోస్వంత బలం పుంజుకోవడానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో గత గురువారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు గత రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చలలో బీజేపీ కి 6 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి 9 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని అయితే బీజేపీ మరిన్ని అసెంబ్లీ స్థానాలు అడగటంతో చర్చలు మరి కొద్దీ రోజులు పొడిగించినట్లు తెలుస్తుంది.అయితే ఎన్డీయే లో టీడీపీ ప్రవేశం కచ్చితంగా జరుగుతుందని ఎన్నికల కోడ్ వచ్చే లోపు బీజేపీ తో పొత్తు, సీట్ల కేటాయింపు ఖాయంగా జరుగుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *