సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్నటి రాప్తాడు సిద్ధం సభ మాదిరిగానే మరోసారి అద్దంకి లో నేడు, ఆదివారం సిద్ధం’ సభ కు లక్షలాది మంది జనం వైసీపీ క్యాడర్ ఎర్రటి ఎండలో పోటెత్తారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్దంకి మేదరమెట్ల సిద్ధం సభ కోసం వచ్చిన లక్షలాది మందికి సెల్యూట్ చేసారు.. తదుపరి ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని పార్టీలు ఏపీలో వైసీపీ ప్రజా పాలనను సంక్షేమాన్ని అడ్డుకోవడానికి అరడజను పార్టీలు ఎన్నికలు లో కుట్రలు కుతంత్రాలతో యుద్దానికి వస్తున్నాయని అయిన వారికీ సేనాపతులే తప్ప జనబలం, సైన్యం లేదని .. అందులో జాతీయ పార్టీలకైతే నోటా కు వచ్చిన ఓట్లు కూడా రావని, అటువంటి వారి కోసం చంద్రబాబు దత్తపుత్రుడు కలసి ఢిల్లీలో వారికీ మోకరిల్లి పొత్తు పెట్టుకొని నాపై ఎన్నికల యుద్దానికి వస్తున్నారని ఎద్దేవా చేసారు. మీ బిడ్డ మీ సోదరుడు జగన్ కు మాత్రం మీ ప్రజల తోనే పొత్తు ఉందని అందుకే 2లక్షల 65వేల కోట్లు రూపాయలు డైరెక్ట్ గా మీ ఎకౌంట్లలో 130 సార్లు బటన్ నొక్కి వేశానని, అధికారం కోసం మోసాలు చేసే చంద్రబాబు అతని ప్యాకేజి కోసం స్వంత పార్టీనే , క్యాడర్ ను మోసం చేసే దత్త పుత్రుడు మాటలు నమ్మితే మీకు వస్తున్నా పధకాలు అన్ని ఎత్తివేస్తారని , ప్రక్క రాష్ట్రాలలో నివాసం ఉండి మన ఆంధ్ర ప్రజలను దోచుకోవడమే.. పంచుకోవడమే వారి పని అని అందరు గుర్తుంచుకోవాలని అన్నారు. అవినీతి లేకుండా గతంలో 2014 ఎన్నికలలో వీరు ముగ్గురు కల్పి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే ప్రజలను మోసం చేసారని .. అప్పటిలో వారు వేసిన కర్రపత్రం చదివి వినిపించారు. ఒంటరిగానే పోటీ కెళ్తున్నా. సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు. చంద్రబాబు 6 పథకాల మేనిఫెస్టోకు.. శకుని పాచికలకు తేడా లేదు. మరి కొద్దీ రోజులలో వైసీపీ మేనిఫెస్టో వస్తుందని తెలిపారు సీఎం జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *