సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఢిల్లీలో ఈ నెల 26వ తేదీ గురువారం రోజు జరిగే రిపబ్లిక్ పెరేడ్ కవాత్తు లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము తరపున కోనసీమ పల్లెల్లో సంక్రాం తి సంబరాలలో అపూర్వముగా నిర్వహించే ప్రభల తీర్ధం ను ఆం ధ్రప్రదేశ్ శకటంగా జగన్ సర్కార్ ఆవిష్కరించనుంది. 74వ గణతం త్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రం నుంచి ‘కోనసీమ ప్రభల తీర్థం ’ నేపథ్యం గా ఎద్దుల బండి తో కూడిన ప్రభల శకటాన్ని రూపొందించారు. కేరళ అందాలను తలపించే పచ్చని కోనసీమ ప్రభల తీర్థానికి సుమారు 500 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. పకృతి ని ప్రేమిస్తూ , మనకు ఆహారం పెట్టె పంట పొలాలలోకి సాక్షాత్తు భగవంతుని స్వరూపాలను ఆహ్వానించి వారికీ పూలు, పండులు సమర్పించి పంటలు సుభిక్షంగా ఉండాలని కోరుకొంటూ వారి అస్సిసులు తీసుకొనే గొప్ప సంప్రదాయం మన కోనసీమవాసులు ది. ఇటువంటి సంప్రదాయం దేశానికీ ప్రపంచానికి కూడా ఆదర్శం.. ప్రకృతి ప్రసాదించిన టేకు చెక్కలు, వెదురు బద్దలు, తాటి శూలం , మర్రి ఊడలు, రంగులనూలు దారాలు, నెమలి పింఛాలు, వరి కంకులు, కూరగాయలతో రూపొందించిన ప్రభలు ఏపీ శకటం పై కనువిందు చేస్తూ ప్రధాని మోడీ తో పాటు భారతీయులతో శాల్యూట్ అందుకోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *