సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయనతో కలసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, కూడా పాల్గొంటున్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఉక్కు పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి కుమార స్వామి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో వేర్వేరు భేటీలలో పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల నిధుల గురించి వారితో చర్చించారు. . అలాగే పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన తాజా పరిస్థితిని కేంద్రానికి సీఎం చంద్రబాబు వివరించారు.
