సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని నేడు, మంగళవారం ఉదయం నరసాపురం ఎంపీ , కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలసి రాష్ట్ర ప్రజలు సమస్యలపై చర్చించి కేంద్ర ప్రభుత్వం పరిధిలో వాటి పరిష్కారానికి ద్రుష్టి పెడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్మ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహచర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
