సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీ అసెంబ్లీ లో నేడు, శనివారం స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం చుట్టుముట్టి ఆయనపై తమ వద్ద ఉన్న ఎజెండా కాపీలను చించి ముక్కలు విసిరి అగౌరపర్చిన క్రమ శిక్షణ పాటించని 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. దీంతో వరుసగా ఐదో రోజు టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌కు గురయ్యారు.నేడు, శనివారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే టీడీపీ సభ్యుల ఆందోళనల చేస్తూ.. . ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఎదో ఉందని ఆ వివరాలు బహిర్గతం చేయాలని… దానిపై సభలో చర్చ జరగాలంటూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. ఢిల్లీ వెళ్లి ఏం సాధించుకొచ్చారంటూ ఆందోళనకు దిగారు. పోలవరానికి ఎన్ని నిధులు తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా ?అంటూ నినాదాలు చేశారు. శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది కేవలం సభా సమయాన్ని వృధా చేయడం కోసమే దుర్భుద్ధి తో చేస్తున్న రచ్చ అని అన్నారు. గతంలో చంద్రబాబు 35 సార్లు ఢిల్లీ వెళ్లారని.. అప్పుడు సభలో ఎందుకు పర్యటనలు ఎందుకు చేసారో ఎప్పుడు చర్చించలేదేమిటి? ఆ 35 సార్లు చర్చించి.. తరువాత ప్రస్తుత సీఎం ఢిల్లీ పర్యటనపై చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *