సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ ( ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ శాస్త్ర సాంకేతిక ప్రభావం) ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనే అంతర్జాతీయ సదస్సు నేడు సోమవారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ నేతలు, ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓలు, వేలాది మంది ప్రతినిధులు దేశ రాజధాని న్యూఢిల్లీకి వచ్చారు.ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రముఖల జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయి తదితరులు ఉన్నారు.అంతర్జాతీయ సమావేశాల్లో ఇది అతి పెద్దదని చెబుతున్నారు. ఈ సదస్సు ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ సదస్సు ఫలితాలు ప్రగతిశీల, వినూత్నమైన భవిష్యత్తుకు సహాయ పడతాయని, ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం.. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ (అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం) అని తెలిపారు. వివిధ దేశాధినేతలు, పలు పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు,ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *