సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి , తిరుగులేని నేతగా ప్రధాని మోడీకి రాజధాని ఢిల్లీలో మాత్రం క్రేజీవాల్ చుక్కలు చూపించడం ఇంకా మానలేదు.. దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికలలో ఓట్ల లెక్కింపులో ఢిల్ల్లీ మేయర్ గా 15 ఏళ్ల పాలనను తాజగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన చీపురు గుర్తుతో ఊడ్చేసింది. నేడు, బుధవారం వెలువడిన మున్సిపల్ ఎన్ని కల ఫలితాల్లో సీఎం అరవింద్ క్రేజీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఢిల్లీలో మొత్తం 250 కార్పొరేషన్ వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి ‘ఆప్’ 134 స్థానాలకు గెలుచుకొంది . దీంతో మేయర్ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 104వార్డులను మాత్రమే గెలుచుకొంది. ఇక కాం గ్రెస్ పార్టీ కేవలం 9 వార్డుల గెలుపుకు పరిమితమైంది. గత 2017 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాల్లో గెలుపొందింది. ఆప్ 48, కాం గ్రెస్ 27 వార్డుల్ని కైవసం చేసుకున్నాయి. రేపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ.. ఢిల్లీ మున్సిపల్ ఎన్ని కల ఫలితాలు ఆప్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *