సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో హోమ్ మంత్రి అమిత్ షా ను అర్ధరాత్రి పొత్తులపై కొద్దీ సేపు చర్చలు జరిగిన నేపథ్యంలో.. ఏపీలో బలం లేని బీజేపీ కి 8 ఎంపీ సీట్లు 25 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేసినట్లు..? చంద్రబాబు 6 ఎంపీ సీట్లు 15 అసెంబ్లీ ఇవ్వడానికి సిద్ధపడినట్లు.. వార్తలు షికారు చేస్తుంటే.. టీడీపీకి బీజేపీ పెద్దలు ఇంకా నిర్ణయం తెలపలేదని 3 రోజులు సమయం కావాలని అడిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎత్తుకు ఫై ఎత్తులు వేసేందుకు వైసిపి పెద్దలు ఢిల్లీలో ప్యూహాలు నడుపుతున్నారు. మరో ప్రక్క ఊహించని రీతిలో ఢిల్లీ నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కి పిలుపు రావడంతో నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు(శుక్రవారం ) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఇక, ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై సీఎం జగన్ చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు సమాచారం.. అయితే బీజేపీ తో వైసీపీ పొత్తు లేనప్పటికీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ను ఆగర్భ శత్రువు గా భావించే సీఎం జగన్ ను బీజేపీ అంతా తేలిగ్గా దూరంగా చేసుకొంటుందా? ప్రధాని మోడీకి పుత్ర సమానుడు గా ప్రచారంలో ఉన్న జగన్ బంధం ఎంత గట్టిదో ఈ ఎన్నికల వేళ.. కొద్దిరోజులలో తెలుస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *