సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేటి గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. ముందుగా ఏపీ సీఎం అధికారిక నివాసం 1 జన్‌పథ్‌కు జగన్ చేరుకున్నారు. అక్కడ వైసిపి ఎంపీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఏపీ సీఎం సమావేశంకానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. రేపు (శుక్రవారం) వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న సదస్సులో జగన్ పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అవకాశం బట్టి ప్రధాని మోడీతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు జైలు లో ఉండటం.. గత 3 వారాలుగా ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులతో భేటీ కోసం విఫల యత్నం చేస్తున్న నారా లోకేష్ అక్కడ ఉండగానే మరో ప్రక్క సీఎం జగన్ ఢిల్లీ పర్యటన టీడీపీ నేతలలో అనేక అనుమానాలుతో రేకెత్తి ఆందోళన రేకెత్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *