సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో నేడు, బుధవారం మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh) పర్యటన కొనసాగుతోంది. నేటి ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. అయితే మర్యాద పూర్వకంగానే ఉపరాష్ట్రపతిని కలిసినట్లు అమరావతిలో నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కొత్త భవనాల్లో కొన్నింటికి వైస్ ప్రెసిడెంట్‌తో శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నట్లు ఇందులో భాగంగానే ఉపరాష్ట్రపతిని ఏపీకి రావాల్సిందిగా లోకేష్ ఆహ్వానించినట్లు లీక్ సమాచారం. లోకేష్ నేడు పలువురు కేంద్రమంత్రులతో లోకేష్ సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 1:10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు. ఏపీ లిక్కర్‌ కేసులో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రికి వివరిస్తారని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *