సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ విద్య శాఖ, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కల్సి ఏపీ అభివృద్ధికి సహకరించవలసినదిగా కోరినట్లు నేడు, బుధవారం ఢిల్లీలోని మీడియా సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా ప్రపంచంలో ఆధునిక టెకనాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రాబోతున్న అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరాంఅన్నారు. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారిని కోరాను అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆయన నివాసంలో సమావేశం అయ్యినప్పుడు .ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం (All India Education Ministers’ Conclav) ఏపీలో పెట్టాలని కోరానన్నారు. నేటి సాయంత్రం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి నారా లోకేష్ , కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ తో ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని రక్షణ శాఖ మంత్రిని కోరారు.రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ…ఏపీ అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
