సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, గురువారం ఉదయం సమావేశమయ్యారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై సీఎం చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామిక వేత్తలు, పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రమే చంద్రబాబు హస్తినకు చేరుకున్నారు. నేటి ఉదయం ముందుగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయిన సీఎం.. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ప్రధానితో బాబు సమావేశమయ్యారు. నేటి ,మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ , 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ 2:45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో తదుపరి నిర్మల సీతారామన్ లతో చంద్రబాబు భేటీ అవుతారు. చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ బయలు దేరుతారు.
