సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 3 రోజులుగా ఢిల్లీ లో ఉన్నఏపీ సీఎం చంద్రబాబు తన పర్యటనను ముగించి నేడు, గురువారం మధ్యాహ్నం నంద్యాల చేరుకొన్నారు. అక్కడ మల్యాల ఎత్తిపోతలను సందర్శించి హంద్రీనీవాకు నీరు విడుదల చేస్తారు. హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలకు జల హారతి ఇవ్వనున్నారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌లతో సమావేశం అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం , వివిధ రంగాల వారీగా పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాలకు సంబంధించి జనశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సీసీఐ సదస్సులో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *