సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ బాంబు పేలుళ్ల లో 13 మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకొని మరో 20 మందిని గాయాలు పాలుచేసి, తీవ్ర విషాదానికి కారకుడైన డాక్టర్ ఉమర్ మహమ్మద్(Umar Mohammed) అలియాస్ ఉమర్-ఉన్-నబీ(Umarun-Nabi) దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో అతడి నివాసాన్ని భద్రతా బలగాలు నేటి శనివారం తెల్లవారు జామున నేలమట్టం చేశాయి.. దీంతో భారత్‌లో ఉగ్రవాద కార్యకలపాలకు మద్దతిస్తున్న వారికి ఇది ఓ సందేశాత్మక హెచ్చరిక అని తెలిపారు. మానవ బాంబుగా పేలిపోయిన ఉమర్ నమూనాలను అతడి తల్లి నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో పోల్చగా.. కారులో ఉన్నది అతడేనని నిర్ధారణ అయింది. నిందితుడు ఉమర్.. ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యునిగా పనిచేసేవాడు. అక్కడే రూమ్ నెంబర్ 13 లో రహస్యంగా బాంబులు తయారు చేసేవాడని సమాచారం. ఈ ఘటనలో అతడి సన్నిహితులైన యూపీకి హైదరాబాద్ కి చెందిన వైద్యులు ముజామ్మిల్, షాహీన్‌లను, మరో మహిళా డాక్టర్ ని అదుపులోకి తీస్కుని విచారణ కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ విచారణలో వచ్చే డిసెంబర్ లో ఢిల్లీ లో ఒకేసారి 33 చోట్ల పేలుళ్లకు వీరు కుట్ర పన్నారని సమాచారం. మనిషి ప్రాణం రక్షించే ఉన్నత మైన వైద్య వృతి లో ఉండి సాటి మనిషి ప్రాణాలు తియ్యమని వీరికి ఏ మతం చెప్పిందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *