సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందాయి. ఈ నెల ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. తాను సీఎం కెసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. రామచంద్ర పిళ్లైను 5 రోజుల కస్టడీ కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఈ పరిణామాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో సీఎం కెసిఆర్ తో చర్చించేందుకు ప్రగతి భవన్కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్తో చర్చించనున్నారు. నేటి, బుధవారం సాయంత్రం మహిళలకు చట్ట సభలలో రిజెర్వేషన్ కోరుతూ మహిళా నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది. ఇక కవిత అరెస్టు తరువాయి అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ కవిత అరెస్టు అయితే ఢిల్లీ, తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలిపేందుకు బిఆర్ ఎస్ శ్రేణులు సిద్ద పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
