సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటనలో భాగంగ సీఎం చంద్రబాబు నరసాపురం ఎంపీ , కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తో కలసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉదయం భేటి అయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11440/- కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు వారిరువురు కలసి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలిపారు, ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మం త్రితో చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆర్హిక కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేసారు. మధ్యాహ్నం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రులను కలసి అనంతరం విజయవాడకు బయలుదేరి వస్తారు. కాగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని నేరుగా నేటి శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ చేరుకున్నారు.
