సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఎప్పటికి క్షమించలేని ఆగర్భ శత్రువుగా భావించే ఏపీ సీఎం జగన్ తీరు మోడీ సర్కార్ కు మరింత కలసి వస్తుంది. అలాగే ఇటీవల తప్పని పరిస్థితులలో కాంగ్రెస్ సాయం తీసుకొన్న, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం క్రేజీ వాల్ లాంటి నేతలకు సైతం జగన్ తీరు పరోక్షంగా దెబ్బతీస్తుంది. విషయంలోకి వెళ్ళితే .. కేంద్రం లోని మోడీ ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్రుత్వంలో ప్రతిపక్షాలు అన్ని కలసి ‘ఇండియా కూటమి’ అడ్డుకొంటుంటే.. ఎన్డీయే లో చేరకపోయిన పార్లమెంట్ ఉభయ సభలలో 31 ఎంపీలతో వైసిపి అతి బలమైన కీలక పార్టీగా అవతరించిన నేపథ్యంలో తాజగా .. దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్.. ఢిల్లీ రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ను తగ్గిస్తూ దేశ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ సవరణ బిల్లు, 2023కు మద్దతు కూడగట్టడం కోసం కేజ్రీవాల్ అనేక ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా పార్టీలు, ముఖ్యమంత్రులతో సమావేశమై, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. చివరికి కాంగ్రెస్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచింది. దీంతో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష కూటమి ఇండియాలో కొనసాగుతోంది. అయితే ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు బదులుగా మోడీ సర్కార్ తీసుకొస్తున్న బిల్లుకు మద్దతివ్వాలని వైసిపి అధినేత సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూరింది.
