సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆయనకు బెయిల్ దక్కింది. ఇద్దరు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ నేడు, శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఆయన తిహాడ్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అయితే కోర్టు పలు షరతులను విధించింది.ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలని తెలిపింది. .లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్‌కు వెళ్లకూడదని ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని షరతులు విధించింది. ఇక ఈ కేసుపై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, సాక్షులతో మాట్లాడకూదని క్లారిటీ ఇచ్చింది. .అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళా అక్కడ బలమైన శక్తిగా ఎదిగిన ఆమ్ అండ్ ఆద్మీ పార్టీ కి క్రేజీ వాల్ బెయిల్ ఫై బయటకు రావడం అదనపు శక్తినిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *