సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు హీరోలలో నాని తన అభిమాన హీరో వెంకటేష్ లా అల్ రౌండర్ మార్గంలో పయనిస్తున్నాడు. అయితే మాస్ ఇమేజ్ మాత్రం అతని పర్సనాలిటీ దృష్ట్యా వంటబట్టడం లేదు. దానితో అగ్ర హీరో కాలేకపోతున్నాడు.. దసరాతో మాస్అవతారాన్ని ఎత్తి పర్వాలేదనిపించుకొన్న నాని, ఆ వెంటనే ఓ తండ్రీ కూతురు కథని ఎంచుకుని ‘హాయ్ నాన్న ’ అంటూ నేడు, గురువారం ప్రేక్షకులను థియేటర్స్ లో పలకరించాడు. శౌర్యువ్ అనే నూతన దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. ఈ సినిమా కద సింపుల్గా చెప్పాలంటే.. విరాజ్ (నాని) ముం బైలో ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. పుట్టినప్పటి నుంచి జబ్బు తో బాధపడుతున్న తన కూతురు మహి (కియారా)కి సరదాగా కథలు చెప్ప డం విరాజ్కి అలవాటు. ఆ కథల్లో హీరోగా నాన్న ని ఊహించుకుంటూ ఉంటుంది. ఓ రోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. కానీ మహికి తన అమ్మ కథని చెప్పడు విరాజ్. దాంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. రోడ్డుపై ప్రమాదం నుంచి ఆ చిన్నారిని కాపాడుతుంది యష్న (మృణాల్ ఠాకూర్). ఆ తర్వాత ఇద్దరూ స్నే హితులు అవుతారు. తరువాత మహికి తన అమ్మ కథని చెబుతాడు. ఈసారి కథలో తన అమ్మ వర్ష పాత్రని యష్న లో చూసుకొంటుంది మహి. ఇంతకీ ఆ వర్ష ఎవరు? చిన్నారి తన అసలు తల్లి చెంతకి చేరిందా లేదా? అన్నది వెండితెరపై చూడవలసిందే.. సినిమాను విశ్లేషిస్తే.. ఈ కథలు తెలుగు సినిమాకి కొత్తేం కాదు. కానీ, ఇందులోని ప్రేమకథలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు బలం గా తీసాడు దర్శకుడు. అయితే సినిమా ప్రధమ భాగం స్లోగా ఉంటుంది. చివరిలో సన్నివేశాలలో ఫీల్ తగ్గినట్టు అనిపిస్తుంది. నిజానికి రెండు ప్రేమకథలు ఇందులో ఉంటాయి. విరాజ్ – వర్ష ( శృతి హాసన్ )కథ ఒకటి, విరాజ్ – యష్న కథ మరొకటి. ఏది ఏమైనా తండ్రీ కూతుళ్ల పాత్రలు ఆ ఇద్దరి నేపథ్యంలో పండే భావోద్వేగాలు, వినోదం ఈ సినిమాకి హైలైట్. చిన్న మాటలలో పెద్ద అర్ధాలు వచ్చేలా డైలాగ్స్ బాగా రాసారు. చిన్నారి తో సహా నటీనటులు తమ పాత్రలలో జీవించారు. కెమెరా, సంగీతం బాగున్నాయి. మంచి ఫ్యామిలీ సినిమా.. ‘హాయ్ నాన్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *