సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన మంచి మెరిట్ సాధిస్తున్న ఇంటర్మీడియట్ విద్యా ర్థిని (16) యనమదుర్రు కాలువలో దూకి ఆత్మహత్య కు పాలబడటం తీవ్ర విషాదం నింపింది. భీమవరం 2వ పట్టణ ఎస్సై పి.అప్పారావు చెప్పిన వివరాలు ప్రకారం .. ఈ విద్యార్థిని తల్లిదండ్రులు మనస్ప ర్థలతో కొన్ని సంవత్సరాలుగా వేరుపడ్డారు. అయితే ఈమె తల్లి వద్ద ఉంటూ చదువు కొనసాగుతుంది. ఈ విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల్లో 470కి 462 మార్కులు సాధించింది. ఇదిలా ఉండగా గత గురువారం సాయంత్రం ఈమె కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయానికి తల్లిదండ్రుల వివాదం పై పెద్దల సమక్షంలో రాజీ చేస్తున్నారు, ఈ క్రమం లో ఆ విద్యా ర్థినిని చూసి ఆగ్రహంతో తండ్రి కొట్టడంతో తీవ్ర ఆవేదనకు గురై ఇంటి నుంచి బయటకు వెళ్లి యనమదుర్రు కాలువలో దూకింది. దీనిపై కుటుంబ సభ్యులు పిర్యదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చెప్పటగా ఆమె మృతదేహం కాలువలో ఉన్నట్లు గత శుక్రవారం గుర్తించారు.ఎంతో మంచి భవిషత్తు ఉన్న ఆ చదువుల తల్లి ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించడం చాల దురదుష్టకరం.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు.
