సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో చేతబడి చేస్తున్నాడని అనుమానంతో ఒక వ్యక్తి ని హత్య చేసి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన రైల్వే కాంట్రాక్టు కార్మికులను పోలీసులు తాజగా అరెస్టు చేశారు. ఈ కేసు ను భీమవరం రైల్వే సీఐ ఎస్.భాస్కరరావు దర్యాప్తు చేసారు. విషయంలోకి వెళితే .. తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చిలకపాడు వద్ద రైలు పట్టాలపై ఈనెల 12వ తేదీ ఉదయం మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తిం చారు. కేసు దర్యాప్తు లో తేలిన అంశాల ప్రకారం.. జార్ఘండ్కు చెందిన సుమారు 60 మంది కార్మికులు రైల్వేలో కాంట్రాక్టు పనుల నిమిత్తం 3 ఏళ్ళు పైగా ఇక్కడ పనిచేస్తున్నారు. అందులో కనురాం లాగురి (30) చేతబడి చేస్తున్నాడనే అనుమానం పెంచుకున్న తోటి కార్మికులు హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఈనెల 11న రైలు పట్టాలపై కూర్చుని ఐదుగురు కార్మికులు తో కలసి మద్యం మద్యం తాగుతున్న సమయంలో దాము తిరియ ఇనుప రాడ్తో కనురాం లాగురి తలపై వెనుక నుంచి గట్టిగా కొట్టడంతో చని పోయాడు. మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. మృతుడి భార్య సునికా లాగురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీ సులు కేసు లోతుగా దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు
