సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతము మార్కెట్ లో పదిరూపాయలు క్వాయిన్స్ తీసుకొంటే మారవు అనే అపోహ బాగా పేరుకొని పోయింది. దానిని తొలగించే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత బరువైన సరే.. కేవలం పదిరూపాయల నాణేలు మాత్రమే చెల్లించి తణుకు పట్టణానికి చెందిన యువకుడు వంటేద్దు సోమ సుందర్రావు నేడు, మంగళవారం బైక్ కొనుగోలు చెయ్యడం విశేషం. ఏకంగా రూ. 1.65 లక్షల విలువైన పది రూపాయల నాణేలతో మోటార్ సైకిల్ కొనుగోలు చేశారు. సాధారణంగా పది రూపాయల కాయిన్ లు చెల్లుబాటు కావడం లేదని అపోహలు నేపథ్యంలో అది తప్పు అని నిరూపించడానికి కాస్త లెక్కించడం కష్టమైన 10 రూపాయల కాయిన్ లు స్వీకరించామని షోరూమ్ అధినేత వెంకట్ తెలియజేశారు.
