సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన ఖరారు అయ్యింది. గతంలో వాయిదా పడిన తణుకు సీఎం పర్యటన ఈసారి షురూ అయ్యింది. తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన తణుకు రానున్నారు. ఈ మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లొగన్ తో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేడు, మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా శ్రీ ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజ్ లో హెలిపాడ్, ఆడిటోరియం, జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ నందు ప్రజా వేదిక, స్టాల్స్ ప్రదర్శనకు ప్రాథమికంగా స్థలాల పరిశీలన చేయడం జరిగింది. రేపు బుధవారం ఆయా ప్రాంతాలను సీఎం కార్యాలయం సెక్యూరిటీ వింగ్ పరిశీలన చేసిన అనంతరం ఖరారు చేయడం జరుగుతుంది. పాలిటెక్నిక్ కళాశాలలోని ఆడిటోరియం నందు సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులతో నిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. జడ్పీ స్కూల్ నందు సభా ప్రాంగణంలో సుమారు మూడు వేల మందితో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ సమావేశంలో cm సమావేశమై ప్రసంగించనున్నారు. అదే ప్రాంగణంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించనున్నారు.
