సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క తణుకు ఎమ్మెల్యే , మంత్రి, కారుమూరి నాగేశ్వర రావు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం రైతుల వద్ద పూర్తిగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ .. ఆయన హామీలు నిజం అయ్యేవరకు..పశ్చిమ లో పార్టీకి పునర్ వైభవం తెచ్చేందుకు.. టీడీపీ వర్గాలు తగ్గేదే లే అన్న రీతిలో… ఈ నెల 12న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రైతుల కోసం తణుకు నియోజకవర్గంలో పోరుబాట నిర్వ హించనున్నారు. జిల్లా పార్టీ అడ్జక్షురాలు, తోట సీతారామ లక్ష్మి ,పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పలువురు జిల్లా నాయకులు కలసి రూట్ మ్యాప్ పరిశీలించారు. ఈ నెల 9న రైతులకు నష్టపరిహాన్ని ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతి పత్రాలు ఇవ్వడం, అనంతరం రైతులతో బైఠాయించి నిరసన, 11న నష్ట పరిహారం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇస్తామని నేతలు తెలిపారు. 12న తణుకు నియోజకవర్గంలో ఇరగవరం నుంచి తణుకు వై.జంక్షన్ వరకు 12 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేసి రైతులు పలకరి స్తారని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.
