సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీని అపహరించి, డ్రైవర్ను కిరాతంకంగా హత్య చేసిన నిందితులను తణుకు పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి లారీ, రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రవిప్రకాశ్ మాట్లాడుతూ.. తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన కడలి వెంకటేశ్వరరావు గత ఏడాది ఆగస్టు 12న లారీలో కోడిగుడ్లు వేసుకుని, కలకత్తా బయలుదేరారు. ఇంతలో ఒక పధకం ప్రకారం ఉత్తరాంధ్ర కు చెందిన చందక గణేశ్,తంగేటిబుల్లియ్య, నిమ్మక సింహాచలం, వానపల్లి శివరామప్రసాద్, శంబనా శాంతారావు, కనపాక నవీన్, కనపాక ప్రవీణ్, సామంతుల విశ్వేశ్వరరావు, అమర్, శివరామప్రసాద్ భార్య దుర్గా భవానిలు అనకాపల్లి వద్ద వద్ద లారీని అడ్డగించి అపహరించి కోడిగుడ్లు చోరీ చేసి వెంకటేశ్వరరావును హత్య చేశారు. అనకాపల్లి వద్ద ఏలేరు కాలువలో మృతదేహాన్ని పడేశారు. అనంతరం వాహనాన్ని ఒడిశా రాష్ట్రం కుర్థా టోల్ ప్లాజా వద్ద వదిలేశారు. అనంతరం లారీలో కోడిగుడ్లను అమ్మివేయగా వచ్చిన రూ.10 లక్షలు పంచుకున్నా రు.లారీ గమ్యస్థానానికి చేరుకోకపోవడం తో అనుమానం వచ్చి న యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యం లో పోలీసులు సెల్ ఫోన్ సిగ్న ల్ ఆధారంగా విచారణ చేపట్టడం తో అసలు నిందితులు లో 4గురు దొరికిపోయారు. వారిని గత సోమవారం కోర్టుకు హాజరుపర్చారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.
