సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు రురల్ పోలీస్ స్టేషన్ లో ఎస్‌ ఐ , ఏజీఎస్‌ మూర్తి ఆత్మహత్య వార్త తెలుగు రాష్ట్రాలలో ఎంతటి సంచలనం కలిగించిందో అందరికి తెల్సిందే.. అయితే ఇది ఆత్మహత్య కాదని . ఎస్‌ఐ మూర్తి అంత బలహీనమైన మనస్సు ఉన్న వ్యక్తి కాదని, ఆ ఆరోజు ఉదయం పోలీస్ స్టేషన్లో పోలిసుల అందరితోనూ మాట్లాడి ప్రెష్ అవ్వడానికి వాష్‌ రూమ్‌కు వెళ్లారు. అయితే అక్కడ రివాల్వర్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. దీనిని గమనించి సిబ్బంది 108లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మూర్తి చనిపోయారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి అసలు నిజాలు తెలియజేస్తాం తెస్తాం’ అని జిల్లా ఎస్పీ నయీం అస్మి ప్రకటించడం ఈ కేసులో ఆసక్తికరమైన ట్విస్ట్ గా మారింది. ఎస్‌ఐ కుటుంబానికి న్యాయం చేస్తామని తణుకు స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. గత శనివారం కోటిపల్లిలో పోలీసు అధికారిక లాంఛ నాలతో అంత్యక్రియలు పూర్తీ అయ్యాయి. ఎస్ ఐ మూర్తి గతంలో పశ్చిమ గోదావరి, భీమవరం టూ టౌన్‌, పాలకోడేరు, పెరవలి, నరసాపురం రూరల్‌, ఆచంట, తణుకు రూరల్‌ స్టేషన్‌లలో పనిచేశాడు. నాలుగు నెలల క్రితం వేల్పూరులో రెండు గేదెల అపహరణ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతా అధికారులు వీఆర్‌లో పెట్టడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *