సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం, జగన్ ఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రములో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన ఏమవుతుందని? ప్రశ్నించారు. వైసీపీ నేతలను ఎదో కేసు పెట్టి జైలుకు పంపినంత మాత్రాన ప్రజల ద్రుష్టి మళ్లించలేరని, ప్రజా సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం, సూపర్ సిక్స్ పధకాలు ఎగ్గొటేయడం, మద్యం, ఇసుక , నిత్యావసర వస్తువుల ధరలు పెంచెయ్యడం, ఇంతటి ప్రజా వ్యతిరేకతను రోజు వైసీపీ నేతలపై కేసులు పెట్టి జనం దృష్టిని మళ్లించేలేరని అన్నారు. గతంలో తనను కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారని , పార్టీని కూడా నడపలేని పరిస్థితికి తెచ్చారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని, కడప ఎంపీ గా పోటీచేస్తే ఉప ఎన్నికలలో 5లక్షల 45 వేల భారీ మెజారిటీ తో గెలిపించారని 18 అసెంబ్లీ స్థానాలలో ఉప ఎన్నికలలో పోటీ చేస్తే 15 స్థానాలలో ఘనవిజయాలు వచ్చాయని, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్ లు కూడా రాలేదని గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఇటీవల తప్పుడు కేసులు పెట్టి కక్ష తో సీనియర్ ఇంటెలీజెన్స్ అధికారి పీఎస్ఆర్ ఆంజయులు నుఅరెస్టు చేసారని ఆరోపించారు.
