సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడులోని కవరైపేట్టై రైల్వే స్టేషన్లో మైసూర్-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును గత శుక్రవారం రాత్రి ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు కోచ్‌లకు మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఆ క్రమంలో దాదాపు 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి.ఏసీ కోచ్ లలో ప్రయాణికులు గాయపడ్డారు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఎదో అద్భుతం జరిగినట్లు ఎవరు మరణించలేదని తాజా సమాచారం. అయితే ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. బాలాసోర్‌లో జరిగినట్లుగానే రైలు ముందుకు సాగడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. రైలు లూప్ లైన్లోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ గూడ్స్ రైలు కూడా నిలబడి ఉంది. ఆ క్రమంలో ప్యాసింజర్ రైలు వెళ్లి గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. షాక్ తగిలేసరికి బ్రేకులు వేశాడు. దానితో ప్రమాదం తీవ్రత తప్పింది.
