సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళ సినీ హీరో , తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ (TVK party Vijay) ఇటీవల రాజకీయ ప్రవేశం నేపథ్యంలో తమిళనాడు లో పలు పట్టణంలో రోడ్డు షో లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (శనివారం) కరూర్‌లో రోడ్‌షో (Karur Road Show) లో 39 మంది అమాయకులు మరణించడంతో తీవ్ర విషాదంగా మారింది. నిజానికి మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన విజయ్ పర్యటనలో ప్రజా ప్రవాహం అభిమానులు మధ్య విపరీత ఆలస్యం కావడం రాత్రి 7 గంటలకు తన ప్రచార వాహనంపై కరూర్ చేరుకోగానే అక్కడ 7 గంటల పైగా నిరక్షిస్తున్న విజయ్ ను చూడటానికి ప్రజలు ఒక్కసారిగా దూసుకొని వచ్చారు. దానితో తీవ్ర త్రొక్కిసలాట గా మారిపోయింది. ఈ ఘటనలో 39కి పైగా మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.అయితే, తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున టీవీకే అధినేత విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం మరియు బాధితులకు అండగా ఉంటామని విజయ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *