సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు ముఖ్యమంత్రి 72 ఏళ్ళ వయస్సు ఉన్న ఎంకే స్టాలిన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నేడు సోమవారం మార్నింగ్‌ వాక్‌ సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రని అన్నా సలైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ సీఎంకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నామని అపోలో హాస్పిటల్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ బీజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *