సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్వయంగా ప్రజలకు గత ఎన్నికలలో ఇచ్చిన సంక్షేమ పధకాలు సూపర్ సిక్స్ హామీలలో తల్లికి వందనం, ( ఇంట్లో ప్రతి చదువుకునే బిడ్డకు 15 వేలు చప్పున..ఎంతమంది ఉంటె అన్ని 15వేలు ఇస్తామన్నారు.) అన్నదాత సుఖీభవ అమలుకు ( మహిళలకు బస్ ఫ్రీ..ఇంకా విద్యార్థులకు కాలేజీల పీజు రియంబర్స్ కూడా చెల్లించలేదు )కావలసిన నిధులు లేవని ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆ పధకాలు అమలు చేస్తామని ప్రజలు అర్ధం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్‌ని సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే.. ప్రజలకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. నిజానికి ‘కూటమి ఇస్తున్న హామీలు’ నెరవేర్చే బడ్జెట్ నిధులు మన రాష్ట్రానికి లేవని గతంలోనే ఎన్నికలకు ముందే ‘జగన్’ కూడా ప్రజలు వివరించారు. అయితే అప్పట్లో చంద్రబాబు తాను సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని. మనస్సుంటే మార్గం ఉంటుందని ప్రకటించడం గమనార్హం..
