సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శుభవార్త! ఎట్టకేలకు తల్లికి వందనం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు (గురువారం) తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. ( గత ఏడాది ఇవ్వలేదు.. ) రేపు (జూన్ 12) తల్లికి వందనం నిధులు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద వారివారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుంది.ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలు చేస్తారని భావిస్తున్నారు. తల్లికి వందనం కింద పిల్లలు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లను కూటమి ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్ధులకూ తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు.
