సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. బాధితుల్లో 90 మంది కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నేటి, బుధవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. మొత్తం కేసుల్లో సగం వరకు ఢిల్లీ (57), మహారాష్ట్ర (54)లో ఉన్నట్టు తెలిపింది. కర్ణాటకలో 19, రాజస్థాన్ 18, కేరళ 15, గుజరాత్ 14 కేసులు నమోదుకాగా తెలుగురాష్ట్రాలయిన, తెలంగాణాలో ఏకంగా 24, ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక్క కేసు నమోదు కావడం విశేషం.. ఇక కోవిడ్ విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 6,317 కేసులు బయటపడ్డాయి. వైరస్ బాధితుల్లో తాజాగా 318 మంది ప్రాణాలు విడిచారు. దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 78,190 గా ఉంది. ఇప్పటివరకు దేశంలో 138.96 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.
