సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్లు లిస్ట్ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా లో ఉన్న 7 నియోజకవర్గాలలో జిల్లా కేంద్రం భీమవరం నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు 2,48,594 మంది ఉండగా నరసాపురం నియోజకవర్గంలో 1,63,346 ఓట్లతో అతి తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తాజగా విడుదలయిన ఓటర్ల జాబితాపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా పరిశీలిస్తు న్నారు. ఓట్లు గల్లంతయితే దరఖాస్తు చేసుకుంటే తదుపరి మరో అవకాశం ఇవ్వనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇదే తుది జాబితాగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉం టుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 14, 42,471 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మిగతా 5 నియోజకవర్గాలలో ఓటర్లు ఎంతమంది అంటే.. ఆచంట 1,76,839 మంది, పాలకొల్లు 1,92,286 మంది ఉండి 2,21,285 మంది తణుకు 2,31,984 మంది, తాడేపల్లిగూడెం 2,08,137 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లా మొత్తం మీద 7,07,411 మంది పురుషులు 7,34,959 స్త్రీ ఓటర్లు ఉండగా లింగమార్పిడి చేయించుకున్నవారు కల్పి మొత్తం కల్పి 14.42,471మంది ఓటర్లు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *