సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కొత్త ఏడాది సమీపిస్తోంది. శుభకార్యక్రమాల సీజన్ జనవరి నెలలో ఉపందుకోనుంది. అయితే నిన్నటి వరకూ పెరుగుతూ పోయిన బంగారం ధర నేడు శుక్రవారం మాత్రం అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత రెండు, మూడు రోజులు మాత్రం బంగారం ధరలు తగ్గాయి. ఆ తరువాతి నుంచి పెరగడం ఆరంభించాయి. తెలుగు రాష్ట్రాలలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.50,050కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,600కు చేరుకుంది. ఇక కిలో వెండిపై రూ.200 వరకూ తగ్గి.. రూ.74 వేల దగ్గర నిలకడగా ఉంది. .
