సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రఖ్యాత జాతీయ మీడియా.. టైమ్స్ నౌ నవభారత్ చేపట్టిన సర్వే లో ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు? అన్న అంశంపై మోడీ ముచ్చటగా 3వ సారి ప్రధాని కావడం ఖాయం అని తేల్చింది. బీజేపీ కి దేశంలో 275 నుండి 325 సీట్లు వచ్చే అవకాశం ఉందని అలాగే ఆం ధ్రప్రదేశ్‌లో ఎన్ని కలు జరిగితే.. వైఎస్సా ర్ సీపీ భారీ విజయాన్ని సాధిస్తుం దని తెలిపింది.ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ లోక్ సభ నియోజకవర్గాల్లోఎన్నికలు జరిగితే.. 25కు 24 లేదా 25 వస్తాయని సర్వే తెలిపింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 0-1 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని, తేల్చింది. ఇక తెలంగాణాలో కెసిఆర్ సారధ్యంలోని బిఆర్ ఎస్ కు 9 లోక్ సభ స్థానాలు బీజేపీ కి 5 స్థానాలు కాంగ్రెస్ కు 2 నుండి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని స్వర్వే ప్రకటించడం విశేషము..
