సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం 17000 కంటే ఎక్కువ WhatsApp ఖాతాలను తాజాగా..బ్లాక్ చేసింది. ఈ ఖాతాలన్ని ఇక్కడివి కావు. ఆగ్నేయాసియాకు చెందిన హ్యాకర్లకు చెందినవిగా గుర్తించారు. పలువురు మోసగాళ్లు ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిట్ ఆఫర్‌లు, గేమ్‌లు, డేటింగ్ యాప్‌లు, ఫేక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల పేరుతో ఖాతాలు తెరిచి ప్రజలను ఆకర్షిస్తూ మోసగిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (I4C), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DOT) కలిసి అలాంటి వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేయాలని నిర్ణయించుకున్నాయి. నివేదికల ప్రకారం సైబర్‌డోస్ట్ I4C, టెలికమ్యూనికేషన్స్ విభాగం సహకారంతో ఆగ్నేయాసియాలో సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల జాబితాను రూపొందించినట్లు తెలిపారు. ఆ తర్వాత వారి వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *