సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కేటాయించింది. ఈమేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వా రా సమాచారం పం పింది. దీనితో ఎన్నికల గుర్తు సస్పెన్సు తొలగిపోయింది. ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంగళగిరిలోని కార్యాలయం లో పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివరావు అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
