సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అందరికి ఆసక్తి రేపిన అంశం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎట్టకేలకు (14నెలలు తరువాత) తన స్వంత ఊరు తాడిపత్రికి వెళ్లేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి (Kethireddy Peddareddy) సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతి ఇచ్చింది. గతంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కేతిరెడ్డి పెద్దారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం. మీరు మీ స్వంత ఊరు తాడిపత్రి వెళ్ళడానికి ఎవరు అడ్డుకొంటున్నారు?.. అని సుప్రీం ప్రశ్నించగా తాడిపత్రి మునిసిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ పోలీసులే తనను పలుసార్లు అడ్డుకొంటున్నారని వాపోయారు. దానితో సుప్రీం కోర్ట్.. మీరు నిర్బయంగా మీ తాడిపత్రి కి వెళ్ళండి. స్థానిక పోలీసులు భద్రతా కల్పించాలి సుప్రీం ఆదేశించింది.. కావాలంటే పెద్దారెడ్డి స్వంత బందోబస్తు ఏర్పాటు చేసుకోవచ్చు.. అని పెద్దారెడ్డి పిటిషన్‌పై విచారణను ముగించింది సుప్రీంకోర్టు. పెద్దారెడ్డి భద్రతకు అవసరమైన అన్ని ఖర్చులు తామే భరిస్తామని కోర్టుకు చెప్పారు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు.
