సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఘరానా మోసం..?అమాయకులకు వలవేసి రెండు కోట్లకు మణిపూరి సత్యనారాయణ అనే వ్యక్తి కొంత కాలం క్రితం టోకరా వేసాడని ఇప్పటికి తమకు న్నాయం జరగలేదని బాధితులు ఆరోపణ చేస్తున్నారు. చిట్స్, అప్పులు, రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులైన పట్టణ ప్రజల నుంచి సుమారు రెండు కోట్లు వసూలు ?చేసి సత్యనారాయణ అతని కుటుంబంతో సహా పరారయ్యాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నాఈ కేసు పురోగతి లేకపోవడంతో బాధితులంతా బొబ్బిలి వెళ్లి సత్యనారాయణను వెతికి పట్టుకుని పోలీస్టేషన్ కు తీసుకువచ్చి అప్పగించామని అయిన కేసు ముందుకు సాగడం లేదని బాధితులు వాపోతున్నారు. . దిగువ తరగతి ప్రజలను టార్జెట్ చేసి అధిక మొత్తాల్లో లాభాలు వస్తాయని నమ్మబలికి కోట్లల్లో వసూలు చేసాడంటూ వారి ఆరోపణ.. ఈ విషయమై పట్టణ పోలీస్ అధికారులు ఇది సివిల్ నేచర్ కేసు కిందకు వస్తుందని క్రిమినల్ కేసు కిందకు రాదని చెప్పారని వెల్లడి . అయితే కోట్లలో చీటింగ్ కు పాల్పడి డబ్బులు దోచుకుని కుటుంబం తో సహా పరారయిన సత్యనారణ అతని కుటుంబం పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ సొమ్ము ఇప్పించాలని పోలీసు అధికారులను వేడుకొంటున్నరు బాధితులు..అసలు వాస్తవాలు వెలుగులోకి రావలసి ఉంది.
