సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు, సోమవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభం కావాల్సిన జనసేన ప్రచార సభలు వాయిదా పడ్డాయి. తాడేపల్లిగూడెం , ఉంగుటూరు ప్రచార సభల్లో పాల్గొనేందుకు పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం సభకు జనసేనాని పవన్ కల్యాణ్, రావాల్సి ఉండగా పవన్ హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత ఇంజిన్లో సాంకేతిక సమస్య లు తలెత్తాయి. దీంతో సభకు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో ఆ రెండు సభల్ని మరో రోజు జరపాలని భావిస్తున్నారు. అయితే ఈ రోజు రాత్రి ఉప్పా డలోని ప్రధాన కూడలిలో భారీ బహిరంగ సభ లో పవన్ ప్రసంగించే అవకాశం ఉంది. నిజానికి షెడ్యూలు ప్రకారం ఈ రోజు టీపీ గూడెం మీటింగ్ తరువాత భీమవరంలో విడిది చెయ్యవలసి ఉన్నప్పటికీ, జనసేన అధినేత పవన్ రేపు మంగళవారం నామినేషన్ దాఖలు చెయ్యవలసి ఉంది. ఆ కారణం గా కూడా ఆయన నేడు పిఠాపురం లోనే ఉండిపోయారని భావించవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం ఉంగుటూరు వారాహి యాత్రలో కొద్దీ రోజుల విరామం తరువాత జరుగుతాయని పార్టీ వర్గాలు ప్రకటించాయి. పిఠాపురం నియోజకవర్గం లోని చేబ్రోలు లోని తన నివాసం నుండి పవన్ ఉదయం 10 గం టలకు గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్లి పవన్ నామినేషన్ వెయ్యనున్నారు.
