సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక విద్య సంస్థ ఏపీ నిట్ లో ఈ ఏడాది మొత్తం 270 సీట్ల ను తగ్గించెయ్యడం నిట్ లో చదవాలనుకొనే విద్యార్థుల అవకాశాలు తగ్గించేసింది. హోం స్టేట్ కోటాలో ఏకంగా ఏపీ విద్యార్థులు 135 మంది, బయట రాష్ట్రాల కోటాలో దేశ వ్యాప్తంగా మరో 135 మంది విద్యార్థులు ఏపీ నిట్లో చేరే అవకాశం లేకుండా పోయింది. ఏపీ నిట్ కు గతంలో డైరెక్టర్ గా వ్యవహరించిన సీఎస్పీ రావు ఫై పలు అవినీతి ఆరోపణలు, దూకుడు నిర్ణయాలు నేపథ్యంలో సస్పెండయ్యా రు. ఆ తర్వాత రెగ్యులర్ డైరెక్టర్ ఇప్ప టివరకు లేరు. నిట్ ఫైలుపై చిన్న సంతకం కావాలన్నా.. తాత్కాలిక ఇంచార్జ్ గా నియమించిన ఉన్న నాగపూర్ నిట్ డైరెక్టర్, ప్రమోద్ పడోలేను కోసం కూడా నాగపూర్ వెళ్ళవలసిందే..దీంతో సరైన కమ్యూనికేట్ చేసేవారు లేక ఈ ప్రభావం తాడేపల్లి గూడెం లోని నిట్ అభివృద్ధిపై పడింది. ఈ విద్యా సంవత్సరంలో నిట్లో ఉండే 750 సీట్లలో ఏకంగా 270 సీట్లకు కోత వేసెయ్యడం దురదృష్టకరం.. ఏపీ నిట్లో ప్రస్తుతం సుమారు 2,300 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. కేంద్ర ఉన్నత విద్యా శాఖ మార్గదర్శ కాల ప్రకారం కనీసం 15 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ ఉన్నా నాణ్యమైన విద్య ను అందించగలరు. కానీ ప్రస్తుతం ఏపీ నిట్లో 43 మంది మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నట్లు ? తెలుస్తుంది. తక్షణం అదనపు ఫ్యాకల్టీ లను నియమించవలసిన అవసరం ఉంది. దీనిపై రాష్ట్ర కేంద్ర స్థాయి ప్రజా ప్రతినిధులు గట్టి కృషి చేస్తే ఫలితం ఉంటుంది.విద్యార్థులకు సీట్లు పెరుగుతాయి,
