సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో టీడీపీ జనసేన నేతల ఉమ్మడి మొదటి ఎన్నికల సభ నేడు, బుధవారం చంద్రబాబు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ , అచ్చేమ్ నాయుడు, నాదెండ్ల మనోహర్, ఎంపీ రఘురామకృష్ణంరాజు లతో పాటు గోదావరి జిల్లాల ఇరు పార్టీల కీలక నేతలు వేదికపై అస్సినులు కాగా విశేష ఇరుపార్టీల కార్యకర్తలు ప్రజలు మధ్య నిర్వహించారు. అయితే ముందుగా అనుకున్నట్లు 6 లక్షల ప్రజా సమీకరణ హడావుడి అక్కడ కనిపించలేదు.. గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఇరుపార్టీల నేతలలో టికెట్స్ రాక సహాయ నిరాయకరణ , నిరసనలు జరుగుతున్నా నేపథ్యంలో దాని ప్రభావం కనపడింది. ఇక పవన్ కళ్యాణ్ వేదికపై మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార బలంతో విర్రవీగుతూ అభివృద్ధి ని గాలికి వదిలేసిన జగన్ ఈ ఎన్నికల వేళా ‘సిద్ధం’ అని ‘వై నాట్ 175’ అంటూ అన్ని స్థానాలలో గెలుస్తానని విర్రవీగుతున్నాడని అతనికి మా యుద్దాన్ని చూపిస్తానని, వైసీపీ పార్టీ ని అధః పాతాళానికి త్రొకేస్తానని సవాల్ చేసారు. జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడడానికి తాను చంద్రబాబుతో కలసి పనిచేస్తున్నానని చంద్రబాబు కు పాలనా అనుభవం ఒక నగరాన్ని నిర్మించిన అనుభవం ఉన్నాయని,4 దశాబ్దాల రాజకీయ ఉద్దంఢుడిని జైలు లో పెడితే బాధ వేసిందన్నారు. రాష్ట్రంలో ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారు ఏపీలో ఏ మూలకు వెళ్లినా ఐదుగురు రెడ్లే పంచాయితీ చేస్తున్నారు. వైసిపి వాళ్ళ దాడులకు జనసేన భయపడదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రము ను జగన్ నాశనం చేస్తుంటే.. సీనియర్ నాయకుడిగా నేను, ప్రశ్నించే నాయకుడిగా పవన్ కల్యాణ్ ఇలా చూస్తూ ఉండలేం.. సీఎం జగన్ సినిమాల టికెట్స్ విషయంలో మాట్లాడానికి వచ్చిన చిరంజీవి ని రాజమౌళిని కూడా అవమానించారని అన్నారు. ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.. ఈ ఎన్నికలు చాల కీలకం. యువతకు 25 ఏళ్ల భవిష్యత్ అందించేందుకే మా ఆలోచన అందరం కలసి పనిచేద్దాం వైసీపీ పాలన కు చరమగీతం పాడడం అని పిలుపునిచ్చారు చంద్రబాబు ,
