సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్స్ వెయ్యడానికి చివరి రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. వీరిలో కీలకంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొట్టు సత్యనారాయణ నామినేషన్ కార్యక్రమంలో పేర్కొనదగినది. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులతో పట్టణ విధుల గుండా కొట్టు సత్యనారాయణ మరియు నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల పాదయాత్రగా కార్యకర్తలకు, ప్రజలకు అభివాదాలు చేస్తూ ర్యాలీగా బయలు దేరటం జరిగింది. ఎర్రటి ఎండలో కొట్టు సత్యనారాయణ ఇంటీ వద్ద నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్రగా జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల తాను పోటీచేస్తున్న 7 సెగ్మెంట్ లలో శరవేగంగా చేస్తున్న ప్రచారం, అందివచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకొంటూ ప్రజలతో మేమేకం అవుతున్న తీరు.. రాజకీయాలకు అతీతంగా కాకలు తీరిన రాజకీయా నేతలను విస్తుపోయేలా చేస్తుంది.
