సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అరసవల్లి స్వామివారికి విన్నపం కోసం రధం లాగుతూ పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నేడు, మంగళవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం మండలం వెంకట రామన్న గూడెం నుంచి తాడేపల్లిగూడెం టౌన్ వరకు ఫ్లెక్సీలు ప్రతి మలుపులోనూ వెలిశాయి.” రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు గో బ్యాక్ గో బ్యాక్ ” అంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలను ముద్రించారు. ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నియోజవర్గం కావడంతో.. బినామీలతో రియల్ ఎస్టేట్ డబ్బుల కోసం చంద్రబాబు కుట్రతోనే పాదయాత్ర జరగుతుందని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. సీఎం జగన్ ప్రతిపాదించిన 3 రాజధానులే ముద్దు.. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి, సమన న్యాయం జరగవలసిందే అంటూ గట్టిగ అమరావతి రైతుల పాదయాత్రను వ్యతిరేకిస్తున్నారు. దీనితో వైసీపీ తీరుపై , టీడీపీ నేతలు, అమరావతి రైతుల పాదయాత్ర చేస్తున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
