సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ విశాఖ-విజయవాడ రైల్వే లైన్‌లో అనేక ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే సీపీఆర్వో అధికారి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి మీదుగా వెళ్లే కొన్ని రైళ్ల వివరాలు.. 08579 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖ నుంచి నవంబరు 2 బుధవారం రాత్రి 07.00 నిమిషాలకు బయలుదేరి రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ, మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్‌కు ఉదయం 8.20 నిమిషాలకు చేరుకుంటుంది.08580 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్‌-విశాఖ మధ్య నవంబరు 3న గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ రైళ్లు నవంబరు 2,9,16,23,30లో విశాఖ నుంచి, నవంబరు 3,10,17,24, డిసెంబరు1లో సికింద్రాబాద్‌ నుంచి నెలకు 5 ట్రిప్‌లుగా బయలుదేరుతాయి.08585 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు నవంబరు 1 మంగళవారం విశాఖపట్నం నుంచి సాయంత్రం 5.35 నిమిషాలకు బయలుదేరి మరునాటి కి మహబూబ్‌నగర్‌కు ఉదయం 10.30 నిమిషాలకు చేరుతుంది.08583 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖ నుంచి నవంబరు7న సోమవారం రాత్రి 7.10కి బయలుదేరి రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, శ్రీకాళహస్తి, మీదుగా తిరుపతికి మంగళవారం ఉదయం 9.15 నిమిషాలకు చేరుతుంది.08584 నంబరు గల ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు నవంబరు 8న మంగళవారం రాత్రి 9.55 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, మీదుగా విశాఖపట్నానికి ఉదయం 10.15 నిమిషాలకు చేరుతుంది.ఈ రైళ్లు విశాఖ నుంచి నవంబరు 7,14,21,28లలోనూ, తిరుపతి నుంచి నవంబరు 8,15,22,29లలో నెలకు 4 ట్రిప్‌లుగా బయలుదేరుతాయి.ఈ ప్రత్యేక రైళ్లకు చెందిన రిజర్వేషన్‌ టిక్కెట్ల సమాచారం కోసం సమీప రైల్వే బుకింగ్‌ కేంద్రాలను సంప్రదించాలి. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *