సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి కి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు ప్రత్యే క రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ.. తాజాగా,నేడు, మంగళవారం శుభవార్త ప్రకటించింది. సికింద్రాబాద్ -కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా తమ ప్రయాణాలు చేస్తాయి. జనవరి 12 నుంచి 14 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 12న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్లో బయలు దేరిన ప్రత్యేక రైలు(07571) మరుసటి రోజు ఉదయం 6.45కి కాకినాడ టౌన్ చేరుకుం టుంది. 13వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడ టౌన్ నుంచి ప్రత్యేక రైలు (07573) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు తిరుపతి చేరుతోంది.
