సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెం సమీపంలో నేటి శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న భారీ వాహనాన్ని అతి వేగంగా వస్తున్నా శాంట్రో కారు అదుపు తప్పి ఢీకొంది. కారు ఆనవాలు లేకుండా తుక్కు తుక్కు అయ్యింది. ఇక కారులో ప్రయాణిస్తున్న కుటుంబీకుల పరిస్థితి దారుణం. కారు ఏలూరు వైపు నుంచి తణుకు వైపు వెళ్తునట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. అక్కడికి చేరుకొన్న పోలీసులు క్షతగాత్రులను మృతులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే తరలించారు. అయితే అక్కడ తీవ్రంగా గాయపడిన బాలిక మరణించింది. మరొకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తీ సమాచారం అందవలసి ఉంది.
